
హుజూర్‌నగర్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డలో నిర్వహించిన పలు కార్యక్రమాలకు హాజరై మాట్లాడారు. చాకలి ఐలమ్మ జీవితం ఆదర్శనీయమన్నారు. చాకలి ఐలమ్మ పేరుతో ఉన్న ఉమెన్స్ యూనివర్సిటీని దేశంలోనే అగ్రగామి యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు.
దేశచరిత్రలోనే మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టిందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేబినెట్‌లో, అసెంబ్లీలో బిల్లును ఆమోదించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, ఏఎంసీ చైర్‌పర్సన్ రాధిక అరుణ్ కుమార్ దేశ్‌ముఖ్, యరగాని నాగన్న గౌడ్, ఈడ్పుగంటి సుబ్బారావు, సాముల శివారెడ్డి, తన్నీరు మల్లికార్జునరావు, దొంతగాని శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.