రోజుకు అర TMC నీళ్లు తగ్గించి.. కేసీఆర్ అన్యాయం చేశాడు : ఆధారాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్

రోజుకు అర TMC నీళ్లు తగ్గించి.. కేసీఆర్ అన్యాయం చేశాడు : ఆధారాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్

పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్ చేసిన కుట్ర వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై.. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన మంత్రి ఉత్తమ్.. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయం, దుర్మార్గాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. 

పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ప్రాజెక్ట్ కింద రోజుకు ఒకటిన్నర టీఎంసీ నీళ్లను తెలంగాణ వాడుకోవాల్సిన ఉండగా.. కేసీఆర్ హయాంలో ఒక టీఎంసీకి తగ్గించారని.. దీని వల్ల రోజుకు అర టీఎంసీ నీళ్లను తెలంగాణ నష్టపోయిందన్నారు. కేసీఆర్ రైతులకు చేసిన దుర్మార్గమైన అన్యాయంగా స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ప్రాజెక్ట్ కింద 7 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వివరించారాయన. ఈ 7 వేల కోట్ల రూపాయలతో 67 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ పూర్తయ్యిందని.. 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ జరిగిందని.. 9 కిలోమీటర్ల ప్రెజర్ పైప్స్ వేయటం జరిగిందని వెల్లడించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 

Also Read : గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో మోసం చేసింది

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో.. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ కింద ఒకే ఒక్క పంపు బిగించి ఓపెన్ చేశారని.. ఆ పంపు కూడా గంట మాత్రమే పని చేసిందన్నారు. ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఈ విధంగా రైతులను మోసం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ లో మరో 11 పంపులను బిగించి.. నీళ్లు ఇస్తున్నట్లు వెల్లడించారాయన. 

పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఒక్క అనుమతి కేసీఆర్ హయాంలో తీసుకోలేదన్నారు మంత్రి. హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు.. ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ లేదు..ఇరిగేషన్ ప్లానింగ్ లేదు.. బీసీ రేషియా అప్రూవర్ లేదు.. ఇంటర్ స్టేట్ పర్మీషన్ లేదు.. ఇలా ప్రతి పనిని పెండింగ్ లో పెట్టారని స్పష్టం చేశారు మంత్రి. 

బీఆర్ఎస్ ప్రభుత్వం 40 వేల కోట్ల పెండింగ్ బిల్లులను ఇచ్చిపోయిందని.. ఇందులో 10 వేల కోట్లు ఇరిగేషన్ బిల్లులే ఉన్నాయన్నారు మంత్రి ఉత్తమ్. తెలంగాణకు 299 టీఎంసిలు, ఏపీకి 512 టీఎంసీలపై బీఆర్ఎస్ ప్రభుత్వం సంతకం చేసిందని.. తెలంగాణకు 34 శాతం నీళ్లు చాలు అని కేసీఆర్, హరీష్ రావు సంతకం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు మంత్రి ఉత్తమ్. 

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు బిఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు మంత్రి. కృష్ణా నదీ జలాల్లో ఒక్క నీటి చుక్కను వదులుకోం అని.. తెలంగాణ హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీపడబోం అని స్పష్టం చేశారాయన.