
కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు స్టోర్ చేస్తే ప్రమాదం పొంచి ఉందని ఎన్డీఎస్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ గుండె లాంటిదన్నారు. మేడిగడ్డలో నీళ్లు స్టోరేజ్ చేయొద్దని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు. జులై 9న ప్రగతి భవన్ లో కృష్ణా,గోదావరి జలాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన ఉత్తమ్.. మేడిగడ్డ ,సుందిళ్ల ,అన్నారం డిజైన్ లోపం ఉందన్నారు. డీపీఆర్ లో చెప్పిన చోట అన్నారం ,సుందిళ్ల కట్టలేదని చెప్పారు ఉత్తమ్. కాళేశ్వరంలో ఏ బ్యారేజ్ కూలిపోయినా 44 ఊర్లు కొట్టుకుపోతాయని చెప్పారు. భద్రాచలం టెంపుల్, టౌన్ కూడా ప్రమాదంలో ఉంటాయన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో అన్నీ లోపాలేనని ఎన్డీఎస్ రిపోర్ట్ ఇచ్చిందని వెల్లడించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ను కూడా బీఆర్ఎస్ నేతలు అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు ఉత్తమ్.
ఉత్తమ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ గుండె లాంటిది. మేడిగడ్డ మేం అధికారంలోకి రాకముందే కూలింది. మేడిగడ్డలో నీళ్లు నింపొద్దని NDSA చెప్పింది. మేడిగడ్డ ,సుందిళ్ల ,అన్నారం డిజైన్ లోపం ఉంది. ఎన్డీఎస్ ఏ రిపోర్ట్ కూడా ఇదే ఇచ్చింది. డీపీఆర్ లో చెప్పిన చోట సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు కట్టలేదు. ఎన్డీఎస్ ఏ రిపోర్టును కూడా బీఆర్ఎస్ నేతలు అవమానిస్తున్నారు.
కాళేశ్వరంలో ఏ బ్యారేజ్ కూలిపోయినా 44 ఊర్లు కొట్టుకుపోతాయి. భద్రాచలం టెంపుల్, టౌన్ కూడా ప్రమాదంలో ఉంటాయి. ప్రాజెక్ట్ నిర్మాణంలో అన్నీ లోపాలేనని ఎన్డీఎస్ రిపోర్ట్ ఇచ్చింది. కాళేశ్వరంలో నీళ్లు స్టోర్ చేస్తే సీరియస్ ఇష్యూ అని ఎన్డీఎస్ఏ చెప్పింది. మేం వచ్చాక ఒక్క చుక్క నీరు మేడిగడ్డ నుంచి ఉపయోగించలేదు. అయినా రికార్డ్ స్థాయిలో వరి ధాన్యం పండించాం.యాసంగిలో కూడా రికార్డు స్థాయిలో వరి పండించాం. రెండు పంటలకు 283 మెట్రిక్ టన్ను వరిధాన్యం పండించాం.
వైఎస్సార్ హయాంలో తుమ్మిడి హట్టి దగ్గర 38 వేల కోట్లతో ఆనాడు ప్రాజెక్టు మొదలు పెట్టాం.ఈ ప్రాజెక్టుకు ప్రాణహిత చేవెళ్ల అని పేరు పెట్టాం.11వేల 600 కోట్ల పనులు ఆనాడు జరిగాయి. మొత్తం ప్రాజెక్టులో 32 శాతం పనులు జరిగాయి. 16 లక్షల ఎకరాల ఆయకట్టుగా ప్రాజెక్ట్ డిజైన్ చేశారు.ప్రాణహిత చేవెళ్ల నీటి లభ్యత లేదని తప్పుడు ప్రచారం చేశారు. ఆ తర్వాత మేడిగడ్డ దగ్గరకు ప్రాజెక్టు మార్చారు. 2లక్షల ఆయకట్టు కోసం నాలుగింతల రెట్లు బడ్జెట్ పెంచారు.38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు చేశారు.
►ALSO READ | ప్రాజెక్టులకు జలకళ..నాగార్జున సాగర్కు భారీ వరద
తెలంగాణ రాకముందు ఏపీకి 4.1 టీఎంసీ ఫర్ డే వెళ్లేది. తెలంగాణ వచ్చాక ఏపీకి 9.6టీఎంసీ ఫర్ డే వెళ్తోంది. ఔటాఫ్ బేసిన్ కు 2004 నుంచి 2014 వరకు 727 టీఎంసీలు తరలించారు. 2014 నుంచి 23 బీఆర్ఎస్ టైంలో 1200టీఎంసీలు అక్రమంగా తరలించారు. కృష్ణా బేసిన్ లో 2024-25లో 286 టీఎంసీలు వాడాం. పదేండ్ల కంటే ఇదే అత్యధికం. కృష్ణా జలాలల్లో 34 శాతం చాలని కేసీఆర్ ఐదు సార్లు సంతకాలు చేశారు. ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం సరిపోతాయని కేసీఆర్,హరీశ్ సంతకాలుచేశారని ఉత్తమ్ వెల్లడించారు.