హైదరాబాద్, వెలుగు: గాంధీ భవన్ లో గురువారం నిర్వహించనున్న మంత్రులతో ముఖాముఖి ప్రోగ్రామ్లో రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నట్టు పీసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలు, పార్టీ కార్యకర్తలకు సంబంధించిన పలు సమస్యలపై మంత్రి వినతి పత్రాలను తీసుకుంటారని ఆ ప్రకటనలో తెలిపింది. కావున ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఈ ప్రోగ్రామ్ ను వినియోగించుకోవాలని పీసీసీ సూచించింది.
