- మంత్రి వాకిటి శ్రీహరి
గద్వాల/మదనాపురం, వెలుగు: రవాణా వ్యవస్థ మెరుగుపడితేనే అభివృద్ధి సాధ్యమని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డితో కలిసి జూరాల ప్రాజెక్ట్ హై లెవెల్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇక్కడి ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల కల ప్రజాపాలనలో సాకారమైందన్నారు. జూరాల ప్రాజెక్టు బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఫోర్ లేన్ ఏర్పాటు చేస్తామన్నారు.
బ్రిడ్జి నిర్మాణం కంప్లీట్ అయితే గద్వాల, ఆత్మకూర్ మధ్య రవాణా వ్యవస్థ మెరుగుపడడంతో పాటు గద్వాల నుంచి హైదరాబాద్ కు 35 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు. మంత్రాలయం, బళ్లారి వెళ్లేందుకు రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. లోయర్ జూరాల దగ్గర నాలుగైదు టీఎంసీలు నిల్వ ఉండేలా చెక్ డ్యామ్ ఏర్పాటు చేస్తామన్నారు. గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డి, రాజశేఖర్, అశోక్, ఏఎంసీ చైర్మన్ రహమతుల్లా, పరమేశ్, గంగాధర్ గౌడ్, తులసీ యాదవ్, నల్లగల్ల శీను పాల్గొన్నారు.
మక్తల్లో కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం..
మక్తల్: మక్తల్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాను ఎగరేసేందుకు కృషి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. పట్టణంలోని 16 వార్డుల్లో పార్టీ తరపున ఎవరూ పోటీలో ఉన్నా సమిష్టిగా అభ్యర్ఠి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. లక్ష్మారెడ్డి, రవికుమార్ యాదవ్, కోళ్ల వెంకటేశ్, గణేశ్ కుమార్ పాల్గొన్నారు.
