రైతులకు పరిహారం పెంచండి : మంత్రి వాకిటి శ్రీహరి

రైతులకు పరిహారం పెంచండి : మంత్రి వాకిటి శ్రీహరి
  • సీఎంను కోరిన మంత్రి వాకిటి శ్రీహరి  

మక్తల్, వెలుగు: కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం మరింత  పెంచాలని కోరుతూ మంత్రి వాకిటి శ్రీహరి శనివారం సీఎం రేవంత్​రెడ్డిని కోరారు. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, కుంభం శివకుమార్​రెడ్డితో కలిసి ఆయన హైదరాబాద్​లో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూములు కోల్పోతున్న రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.