ఎన్ఎండీసీ మారథాన్ రన్నర్స్కు మంత్రి వివేక్ సన్మానం

ఎన్ఎండీసీ మారథాన్ రన్నర్స్కు మంత్రి వివేక్ సన్మానం

బషీర్​బాగ్, వెలుగు: తెలంగాణలో అతిపెద్ద రన్ అయినటువంటి ఎన్ఎండీసీ మారథాన్లో పాల్గొన్న వారిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్​వెంకటస్వామి అభినందించారు. 42 కిలోమీటర్లు రన్​ పూర్తి చేసిన శాంతివనం రన్నర్స్ మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామం చెందిన హరికే సంతోశ్ ఆధ్వర్యంలో వివేక్ వెంకటస్వామిని సోమాజిగూడలోని ఆయన నివాసంలో కలిసి హైదరాబాద్ మారథాన్ గురించి వివరించారు. ఈ సందర్భంగా మారథాన్ రన్ లో  పాల్గొన్న బోడుప్పల్, మేడిపల్లి శాంతివనం రన్నర్స్ సభ్యులు కట్ట శేఖర్, సోము పటేల్, సంతోశ్ ను మంత్రి సన్మానించారు.