చెన్నూర్ మున్సిపాలిటీలో మంత్రి వివేక్ మార్నింగ్ వాక్.. అభివృద్ధి పనుల పరిశీలన

చెన్నూర్ మున్సిపాలిటీలో మంత్రి వివేక్ మార్నింగ్ వాక్.. అభివృద్ధి పనుల పరిశీలన

కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూర్ నియోజకవర్గ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా మంగళవారం (సెప్టెంబర్ 16) ఉదయం చెన్నూర్ మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్ నిర్వహించారు.  మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. 

మున్సిపాలిటీలో నూతనంగా నిర్మిస్తున్న అమృత్ 2.0 పనులను పరిశీలించారు మంత్రి వివేక్. పట్టణంలో నిర్మిస్తున్న అంబేద్కర్ భవనం నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిష్టంపేట గ్రామంలో నూతన బోర్ వేల్ ను ప్రారంభించారు మంత్రి వివేక్ వెంకటస్వామి.