ఐదేళ్లలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభలో మాట్లాడారు వివేక్. ఐదేండ్లలో 17లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పారు. పేదల కోసం రేషన్ కార్డుపై సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లుఇస్తున్నామని తెలిపారు.
బీఆర్ఎస్ సర్కార్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు తమ ఆస్తులు పెంచుకుని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు మంత్రి వివేక్. బీఆర్ఎస్ అప్పులకు నెలకు రూ. 5 వేల కోట్ల మిత్తీలు కడుతున్నామని చెప్పారు. యంగ్ ఇండియా స్కూళ్లతో విద్యారంగంపై భారం తగ్గుతుందన్నారు. హుస్నాబాద్ లో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సర్కార్ చేసిన అభివృద్ధితోనే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచిందన్నారు వివేక్. కేటీఆర్ ఒక ఫెయిల్యూర్ లీడర్ అని..ఆయన నాయకత్వంలో పనిచేయాలో లేదో ఆ పార్టీ కార్యకర్తలు తెలుసుకోవాలన్నారు.
