జూబ్లీహిల్స్లో 15 శాతం మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం: మంత్రి వివేక్ వెంకటస్వామి

జూబ్లీహిల్స్లో 15 శాతం మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం: మంత్రి వివేక్ వెంకటస్వామి

రామగుండం: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించారు. వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో 15 శాతం ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో 21 శాతం ఉన్న కాంగ్రెస్ ఓట్ బ్యాంకును  ఇంఛార్జ్గా అవకాశం ఇచ్చిన తర్వాత 45 శాతం వరకు తీసుకురావడం జరిగిందని చెప్పారు.

గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఆ ప్రాంతంలో చేసిందేమీ లేదని, రాహుల్ గాంధీ సూచన మేరకు ఓటు చోరీ గురించి ప్రజలకు తెలియజేస్తూ ప్రసారం చేస్తున్నామని మంత్రి తెలిపారు. కాకా వెంకటస్వామి అడుగుజాడల్లో నడుస్తూ పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రజాసేవలో దూసుకుపోతున్నారని మంత్రి కితాబిచ్చారు. కాకా వెంకట స్వామికి 1981లో ఐక్యరాజ్యసమితిలో మాట్లాడే అవకాశం దక్కగా నేడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు కూడా అవకాశం దక్కిందని మంత్రి వివేక్ వెంకటస్వామి హర్షం వ్యక్తం చేశారు. అన్ని దేశాలు అభివృద్ధి బాటలో ఉండాలని, భారతదేశ అభివృద్ధికి ప్రపంచ దేశాలు సహకరించాలని కోరడం జరిగిందని చెప్పారు.

ALSO READ : 42వేల కోట్లతో రెండు కొత్త పథకాలకి ప్రధాని మోదీ శ్రీకారం..

ఇటీవల మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్తో పాటు సింగరేణి విశ్రాంతి కార్మికులకు పెన్షన్ కోసం 120 కోట్ల ఫండ్ను కేటాయించేందుకు ఎంపీ కృషి చేశారని, అలాగే రామగిరి ఖిల్లా నాలుగు కోట్ల రూపాయలతో టూరిజం స్పాట్గా తీర్చిదిద్దేందుకు కృషి చేశారని మంత్రి గుర్తుచేశారు. ఇటీవల జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కాకా వెంకటస్వామి చేసిన సేవలను ప్రజలకు వివరించారని చెప్పారు. సింగరేణి సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు కాకా సహకారం అందించారని, సింగరేణి ప్రాంతంలో లక్ష ఉద్యోగాలు కాపాడడంతో పాటు సుమారు 30 వేల మందికి ఇంటి పట్టాలను ఇప్పించిన ఘనత వెంకటస్వామిదని గుర్తుచేశారు. 

మందమర్రి పాత బస్టాండ్ ప్రాంతంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఓటు చోరీపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈవీఎం మిషన్లు తీసివేసి బ్యాలెట్ పద్ధతిలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ దేశవ్యాప్తంగా చేపడుతున్న సంతకాల సేకరణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాముల కావాలని మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.