మెదక్ జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్న శంకరంపేట్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట్ స్వామి అమర వీరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు. అనంతరం జెడావిష్కరించారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులు అమరవీరుల గుర్తు చేసుకుంటూ ప్రదదర్శించిన కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.
మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ ఎస్ పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు జేశారని అన్నారు. కమిషన్ల కోసమే లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని విమర్శించారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవం సంబురాలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి జెండావిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అంతకు ముందు గన్ పార్కు దగ్గర అమర వీరుల స్తూపానికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో్ మంత్రులు, అధికారులు, ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ ఆటాపాటలతో సంబురాలను జరుపుకున్నారు.
