సుల్తానాబాద్ పట్టణంలోని అభిమాని ఇంటికి మంత్రి వివేక్ వెంకటస్వామి

సుల్తానాబాద్ పట్టణంలోని అభిమాని ఇంటికి మంత్రి వివేక్ వెంకటస్వామి

సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు, కాకా అభిమాని ధరడే శ్యామ్, సుచిత దంపతుల కొడుకు ఆద్విక్ పుట్టిన రోజుకు రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. అనంతరం చిన్నారికి ఆశీస్సులు అందజేసి, స్వీట్లు తినిపించి కానుక అందజేశారు. ఈ సందర్భంగా శ్యామ్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ లీడర్లు మంత్రిని శాలువాలతో సత్కరించారు. 

కార్యక్రమంలో సీనియర్ నాయకులు సజ్జద్, గాజుల రాజమల్లు, నీరటి శంకర్, అడ్డగుంట శ్రీనివాస్ గౌడ్, తోట శంకర్, అడ్వకేట్ కరుణాకర్, ప్రశాంత్, అంబేద్కర్ సంఘం నాయకులు శ్రీనివాస్, కనుకయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం పంచాయతీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన పలువురిని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.