ఘనంగా మంత్రి వివేక్ వెంకటస్వామి బర్త్డే ..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు

  ఘనంగా మంత్రి వివేక్ వెంకటస్వామి బర్త్డే ..ఉమ్మడి  ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు
మైనింగ్, కార్మికశాఖ మంత్రి డాక్టర్​ గడ్డం వివేక్​ వెంకటస్వామి పుట్టిన రోజు వేడుకలు ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా వ్యాప్తంగా  ఘనంగా జరిగాయి. కాంగ్రెస్​ నేతలు,  ఎన్​ఎస్​యూఐ లీడర్లు, మాలసంఘాల నాయకులు, పలు గ్రామాల ప్రజలు మంత్రి పుట్టిన రోజును సంబురంగా జరిపారు. అభిమానులు రక్తదానాలు, అన్నదానాలు నిర్వహించారు. 

కోల్​బెల్ట్/చెన్నూరు/జైపూర్​/కోటపల్లి​,వెలుగు: రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తున్న రాష్ట్ర మైనింగ్, కార్మికశాఖ మంత్రి డాక్టర్​ గడ్డం వివేక్​ వెంకటస్వామి రాజకీయంగా ఉన్నత పదవులను అధిరోహించాలని మంచిర్యాల జిల్లా డీసీసీ ప్రెసిడెంట్​ పిన్నింటి రఘునాథ్​రెడ్డి, కాంగ్రెస్​ లీడర్లు పేర్కొన్నారు.

ఆదివారం రాష్ట్ర మంత్రి వివేక్​ వెంకటస్వామి 68వ బర్త్​డేను మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు,అభిమానులు, కళాకారులు, డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్ల వాసులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్రం రావడానికి కీలక పాత్ర పోషించిన మంత్రి వివేక్​ వెంకటస్వామి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవ చేసే అవకాశం ఆ దేవుడు కల్పించాలని కోరారు. 

కాకా ప్రజలకు ఎన్నో సేవలను అందించారని,తండ్రి బాటలో వివేక్​ వెంకటస్వామి ప్రజలకు అండగా నిలుస్తారని పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నారని కొనియాడారు.వివేక్​ వెంకటస్వామి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుణ్ణి వేడుకున్నారు. 

మంత్రి వివేక్​ బర్త్​డే సందర్భంగా మందమర్రి,క్యాతనపల్లి,రామకృష్ణాపూర్​,చెన్నూరు,భీమారం,జైపూర్​,కోటపల్లి,మంచిర్యాల జిల్లా కేంద్రం,మంచిర్యాల-నస్పూర్​ మండలాల్లోని గ్రామాలు,మున్సిపాలిటీ,మండల కేంద్రాల్లో కాంగ్రెస్​ శ్రేణులు కేక్​లు కట్​ చేసి సంబురాలు జరిపారు.స్వెట్టర్లు,దుప్పట్లు,చీరల పంపిణి,మోగా బ్లడ్​ డోనేషన్ల క్యాంపులు,అన్నదానాలు, పండ్ల పంపిణి చేపట్టారు.ఆలయాలు,చర్చిలు,దర్గాల్లో మంత్రి వివేక్​ పేరిట పూజలు,ప్రార్ధనలు నిర్వహించారు.

పలు వేడుకల్లో మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్​ పిన్నింటి రాఘునాథ్​రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  సాయిలింగి గ్రామంలోని సాయి వృద్ధాశ్రమంలో మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేష్  అన్నదానం చేశారు.