మంచిర్యాల జిల్లాలో బిజీబిజీగా గడుపుతున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పలు ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు.
కోటపల్లి మండలంలోని దేవులవాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనాన్ని ప్రారంభించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సుమారు 20 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించిందన్నారు. అనంతరం మండలంలోని లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
నవంబర్ 12న ఉదయం జైపూర్ మండల కేంద్రంలో కస్తూర్భా గురుకుల కాలేజీ కొత్త బిల్డింగ్ ను ప్రారంభించారు. అనంతరం భీమారం మండలంలోని గొల్లవాగు ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు . ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్... మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, గుంటల్లో 100 శాతం రాయితీపై ఉచితంగా చేప పిల్లలు విడుదల చేస్తుందన్నారు. చెన్నూరులో మోడల్ ఫిష్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
