- మోదీ, అమిత్‌షా కనుసన్నల్లో జ్ఞానేశ్‌కుమార్ పనిచేస్తున్రు
- రాహుల్ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం
- రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
- మందమర్రిలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ, ధర్నా
కోల్‌బెల్ట్/ సిద్దిపేట టౌన్, రూరల్, వెలుగు: దేశంలో ఓట్ల చోరీకి కారణమైన చీఫ్ ఎలక్షన్కమిషనర్జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి డిమాండ్‌చేశారు. ఆయన రిజైన్చేసేదాకా కాంగ్రెస్ పోరు ఆగదని స్పష్టం చేశారు. ఓట్‌చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, ప్రతిపక్ష ఎంపీలను అరెస్ట్‌చేయడాన్ని ఖండించారు. దీనికి నిరసనగా గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రి పాత బస్టాండ్‌వద్ద జాతీయ రహదారిపై కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టాయి.
ముందుగా పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న మంత్రి వివేక్‌వెంకటస్వామి మాట్లాడుతూ.. ఓట్చోరీ ఆంశంపై సమగ్ర విచారణ జరిపాలన్నారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్‌షా కనుసన్నల్లో పనిచేస్తున్నాడని, ముగ్గురూ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఫైర్అయ్యారు. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్ల తొలగింపు వల్లే అక్కడ ఆ పార్టీ గెలిచిందని ఆరోపించారు. ఓట్చోరీపై రెండేళ్లుగా రాహుల్‌గాంధీ పోరాటం చేస్తున్నారని, ఆయన ప్రశ్నలకు కేంద్రం, ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్‌రెడ్డి, కాంగ్రెస్ నేత జగన్మోహన్రావు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లోనే దళితులకు సముచిత స్థానం
కాంగ్రెస్‌లోనే దళితులకు సముచిత స్థానం ఉంటుందని, పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి వివేక్‌వెంకటస్వామి సూచించారు. మందమర్రిలోని బి-1 ఎమ్మెల్యే క్యాంప్‌ఆఫీస్‌లో టీపీసీసీ ఎస్సీ సెల్జిల్లా సమావేశానికి హాజరై ఎస్సీ సెల్నూతన కమిటీకి నియామక పత్రాలు అందజేశారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడమే మనందరి లక్ష్యమన్నారు. డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ పైడిమల్ల నర్సింగ్తదితరులున్నారు.
కేసీఆర్ ఫ్యామిలీకి 340 ఎకరాలు ఎలా వచ్చాయి?
తెలంగాణ ఉద్యమానికి ముందు 22 ఎకరాల భూమి ఉన్న కేసీఆర్ ఫ్యామిలీకి 340 ఎకరాలు ఎలా వచ్చాయని ఉమ్మడి మెదక్‌జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. గురువారం సిద్దిపేటలో పర్యటించిన ఆయన కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కేసీఆర్ అడ్డగోలుగా సంపాదించారని ఆరోపించారు. పాండురంగసాగర్ నుంచి కేసీఆర్ ఒక్కరే నీరు పారించుకుంటున్నారన్నారు. ఆయన ఫామ్ హౌస్ఉన్న 325 సర్వే నంబర్ లో 45 ఎకరాల జాడలేదని, ఆ భూమి ఏమైందన్నది కలెక్టర్ విచారణలో తెలుతుందని చెప్పారు. సిద్దిపేట అర్బన్ మండలంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపై విచారణ జరపాలని కలెక్టర్ కు ఆదేశాలు ఇస్తామన్నారు. హరీశ్ రావుకు సింగరేణి గురించి ఏమీ తెలియదని మంత్రి విమర్శించారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌పాలనలో ఎందుకు సింగరేణి కొత్త గనులు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటలో సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి, విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్అందిస్తామని చెప్పారు. అంతకుముందు ఇందిరా మహిళా శక్తి, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, కాంగ్రెస్సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ పూజల గోపీకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి, నాయకులు పాల్గొన్నారు.
నీటి వినియోగంపై అవగాహన కల్పించాలి
ఎల్ నినో నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని, రైతులకు నీటి వినియోగంపై అవగాహన కల్పించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. గురువారం సిద్దిపేట కలెక్టరేట్ లో మీటింగ్నిర్వహించారు. తాగునీటికి ఇబ్బంది రా కుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులు ఫార్మ్ పాండ్స్ నిర్మించుకునేలా చూడాలన్నారు. టామ్‌కామ్ ద్వారా జిల్లాలో కనీసం 100 మంది యువతను ఎంపిక చేసి, జర్మన్ భాషలో శిక్షణ అందించి, విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సీఎం బ్రేక్ ఫాస్ట్ తో ఎంతో ప్రయోజనం
ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకంతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మందమర్రి తెలంగాణ మోడల్స్కూల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అడిషనల్కలెక్టర్చంద్రయ్యతో కలిసి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి టిఫిన్చేశారు. మందమర్రి మోడల్ స్కూల్ తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా ఎంపికైందని, తాను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర నిధులు తీసుకొచ్చి మందమర్రిలో ఈ పాఠశాలను ఏర్పాటు చేయించానన్నారు. వచ్చే ఏడాది పాఠశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తే ప్రత్యేక గిఫ్ట్ఇస్తానని హామీ ఇచ్చారు. చెన్నూర్ మండలం సోమనపల్లిలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను వచ్చే ఏడాది ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏసీపీ కిరణ్‌కుమార్, సీఐ పర్స రమేశ్, తహసీల్దార్ సతీశ్‌కుమార్, ఎంపీడీవో రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, ఎంఈవో రమేశ్‌రాథోడ్, ప్రిన్సిపాల్ సారా తస్నీమ్ తదితరులు పాల్గొన్నారు.
