స్థానిక ఎన్నికల్లో కష్టపడి పనిచేయండి..మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్కు మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ సూచన

స్థానిక ఎన్నికల్లో కష్టపడి పనిచేయండి..మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్కు మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ సూచన

కోల్ బెల్ట్, వెలుగు: రాష్ట్రంలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం కష్టపడి పనిచేయాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూచించారు. మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్​గా ఎన్నికైన పిన్నింటి రఘునాథ్​రెడ్డి మంగళవారం హైదరాబాద్​లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మంత్రి, ఎంపీని కలిశారు. వారికి బొకేలు అందజేసి సన్మానించారు. 

స్వీట్లు పంచుకున్నారు. తనకు డీసీసీ ప్రెసిడెంట్ పదవిని వచ్చేలా కృషి చేసిన వారికి రఘునాథ్​రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం, బూత్​స్థాయి నిర్మాణం జరిగేలా పార్టీ శ్రేణులను సమన్వయం చేయాలని డీసీసీ ప్రెసిడెంట్​కు అనంతరం మంత్రి, ఎంపీ సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని, యువతకు అవకాశాలు కల్పించాలని, కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని రఘునాథ్​రెడ్డి తెలిపారు.