ఇందిరాగాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకొని మంచిర్యా జిల్లా కిష్టంపేట గ్రామంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా దేశ ప్రధానిగా మహిళల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన మహిళా నాయకురాలు ఇందిరా గాంధీ సేవలను కొనియాడారు. అనంతరం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకు కృషి చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామికి గజమాలతో సత్కరించారు చెన్నూరు కాంగ్రెస్ నాయకులు. బాణాసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకొని సంబురాలు జరుపుకున్నారు.
శ్యాండ్ బజార్ ప్రారంభం
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావురావుపేటలో శ్యాండ్ బజార్ ఏర్పాటు చేశారు. టీజీఎండీసీ ఆధ్వ ర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఇసుక బజారు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఇవాళ పూజలు నిర్వహించి ప్రారంభించారు. తాజాగా ఏర్పాటు చేసిన శ్యాండ్ బజార్ ద్వారా తక్కువ ధరకే ప్రజలకు ఇసుకను అందిస్తారు. ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్న ప్రజలకు ఇసుక లభ్యతను సులభతరం చేయడం, అక్రమ రవాణాను అరికట్టడం దీని ప్రధాన ఉద్దేశం. బావురావుపేటలో ఏర్పాటు చేసిన శ్యాండ్ బజార్లో చెన్నూరు నియోజకవర్గంలోని అనేక గ్రామాల ప్రజలకు ఇండ్ల నిర్మాణానికి ఇసుక తక్కువ ధరకు లభించనుంది.
బీఆర్ఎస్ లీడర్లు దోపిడీ చేసిండ్రు : మంత్రి వివేక్
గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ లీడర్లు ప్రజల సొమ్మును దోపిడీ చేశారని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఇసుక దందాకు పాల్పడ్డి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని విమర్శించారు. శ్యాండ్ బజారు ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అక్రమ ఇసుక దందాను అరికట్టామని చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్ ఖజానాను ఖాళీ చేయడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మా రిందన్న మంత్రి.. సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మైనింగ్ శాఖ ద్వారా గత ఏడాది కంటే ఈ ఏడాది 18శాతం అధికంగా పన్నులు వసూలు చేశామన్నారు.
