డిసెంబర్ లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి వివేక్ వెంకటస్వామి

డిసెంబర్ లో రెండో విడత ఇందిరమ్మ  ఇండ్లు : మంత్రి వివేక్ వెంకటస్వామి

డిసెంబర్ లో రెండో విడత ఇందిరమ్మ  ఇండ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.  17 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యమని చెప్పారు. సిద్దిపేట జిల్లా  దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్ పేట భూంపల్లి   మండలం రామలింగేశ్వర ఫంక్షన్ హాల్ లో410 కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్  వెంకటయ్య, సిద్దిపేట కలెక్టర్ హైమావతి  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామి. .రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పథకాలు అన్ని అమలయ్యేలా చూస్తుంది.  సన్న బియ్యం ఇస్తూ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. నియోజకవర్గానికి 3500  ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం.. ఇప్పటికే 70 శాతం ఇందిరమ్మ ఇండ్లు పూర్తయ్యాయి. ఇప్పటికే పలువురు లబ్ధిదారులకు బెస్ మెంట్ ల కు సంబంధించిన పేమెంట్ ఇచ్చాం..నిబంధనలకు లోబడి కట్టిన వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. డిసెంబర్ లో  మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. 

►ALSO READ | RTA చెక్ పోస్టుల స్థానంలో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ విధానం

రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో  కొత్త పథకాలు తెచ్చి వాటిని అమలు చేస్తుంది. ఖజానా ఖాళీ అయింది.  గత పదేళ్లలో చేసిన అప్పులకు మిత్తి కట్టడానికి సరిపోతుంది.  ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన నష్టానికి కేబినెట్ మీటింగ్ లో మాట్లాడి నిధులు విడుదల చెయిస్తా అని అన్నారు మంత్రి వివేక్.