గోదావరిఖనిలో కాంగ్రెస్ నాయకుడి కుటుంబానికి మంత్రి వివేక్ పరామర్శ

గోదావరిఖనిలో కాంగ్రెస్ నాయకుడి కుటుంబానికి మంత్రి వివేక్ పరామర్శ

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించారు. జైపూర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు వివేక్ వెంకటస్వామి. సత్యనారాయణ రెడ్డి అత్తగారు లలితమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా లలితమ్మ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి.

బీఆర్ఎస్ పని ఖతం

రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఖతం అని వివేక్ వెంకటస్వామి అన్నారు. గ్రామాల్లో గులాబీ పార్టీ క్యాడర్ ను కోల్పోయిందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులకు ఆయన ఇవాళ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరు చెప్పి ఆ పార్టీ పదేండ్లు ప్రజలను మభ్య పెట్టిందని ఆరోపించారు. గత పదేండ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇచ్చిన ఘటన కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు.