నా ఫస్ట్ ప్రియారిటీ క్వాలిటీ ఎడ్యుకేషన్ కే ఇస్తా: మంత్రి వివేక్ వెంకటస్వామి

 నా ఫస్ట్ ప్రియారిటీ క్వాలిటీ ఎడ్యుకేషన్ కే ఇస్తా: మంత్రి వివేక్ వెంకటస్వామి

కాంగ్రెస్ ప్రభుత్వం  విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.  మంచిర్యాల జిల్లా  జైపూర్ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలిక జూనియర్ కళాశాల నూతన భవనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రారంభించారు.  రూ. 2.55 కోట్ల  సమగ్ర శిక్ష నిధులతో నూతన భవన నిర్మాణం చేపట్టారు అధికారులు.  ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిలో మొదటగా విద్యకు ఎక్కువ  ప్రియార్టీ ఇస్తానని చెప్పారు వివేక్. 

మీడియాతో మాట్లాడిన మంత్రి వివేక్ వెంకట స్వామి..‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.  ప్రభుత్వం వచ్చాక 51 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యా సంస్థలలో టీచర్ల కొరత అనేది లేదు.  గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత ఉండేది. స్టూడెంట్స్ కి సరైనా విద్య అందేది కాదు. ఎక్కడ సమస్యలు ఉన్నా   నా  దృష్టికి తీసుకువస్తే నిధులు మంజూరు చేయిస్తా. 75 శాతంమార్కులు వచ్చిన విద్యార్థులకు మా అంబేద్కర్ కాలేజ్ లో ఫ్రీ. వారి కోసం 70 నుంచి 80 లక్షలు ఖర్చు చేశాం.  విద్యార్థుల కోసం విశాఖ ట్రస్ట్ నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తాం’.

‘విద్యార్థులు మంచిగా చదువుకోవాలి.. తల్లిదండ్రుల ఆశయాలను కొనసాగించాలి. విద్యార్థులు అందరూ డిసిప్లిన్ నేర్చుకోవాలి. విద్యార్థులు వివేకానంద స్ఫూర్తితో ముందుకెళ్లాలి. చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు. బిల్ గేట్స్ లాంటి పెద్ద పెద్ద మహానుభావులే కష్టపడి పైకి వచ్చారు. టీచర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలి. ఇంట్లో అమ్మా నాన్నలకు సహాయం చేయాలి. విద్యార్థులు అందరూ చదువుతో పాటు క్రీడల్లో పాల్గొంటే మేథా శక్తి పెరుగుతుంది. విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించడంపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. షాఫ్ట్ స్కిల్స్ తో మంచి ఉద్యోగాలు సాధించుకోవచ్చు. గత ప్రభుత్వంలో అద్దె భవనాల్లో విద్యార్థులు చదువుకునేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సొంత పాఠశాల భవనాలు నిర్మాణం చేపడుతున్నారు.  గతంలో పెద్దపల్లి పార్లమెంట్ డివిజన్ లో అన్ని స్కూల్స్ లలో బెంచీలు ఇచ్చాము. పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నాం. చెన్నూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 50 లక్షలు మంజూరు చేశాం’ అని అన్నారు వివేక్.