రాష్ట్రంలో 2,06,949 మందికి ఫ్యాబిఫ్లూ..24,408 మందికి రెమ్ డెసివిర్

రాష్ట్రంలో 2,06,949 మందికి ఫ్యాబిఫ్లూ..24,408 మందికి రెమ్ డెసివిర్

రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ తో పాటు ఇతర మందులు ఇప్పటి వరకు వంద శాతం పనిచేసినట్లు ఆధారాల్లేవన్నారు మంత్రి ఈటెల రాజేందర్. మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఈటెల  రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,06,949 మందికి ఫ్యాబిఫ్లూ… 24,408 మందికి రెమ్ డెసివిర్  ఇంజక్షన్ లు ఇచ్చామన్నారు.  తాము ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం మందులు వాడుతున్నామన్నారు. రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ తో పాటు ఇతర మందులు కూడా ఈ నాటికి నూరు శాతం పనిచేసినట్టు ఆధారాలు లేవన్నారు. కరోనా నేపథ్యంలో కోట్ల సంఖ్యలో మందులు సమకూర్చుకున్నామన్నారు. మన రాష్ట్రంలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 0.6 శాతం మాత్రమే  డెత్ రేట్ ఉందన్నారు. కరోనా విషయంలో బ్రిటన్, అమెరికా లాంటి దేశాలు కుప్పిగంతులు వేశాయన్నారు.

అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లు..ఇది చారిత్రాత్మకమైన రోజు

దోచుకోవడం దాచుకోవడమే కేసీఆర్ ఎజెండా