
హైదరాబాద్: కూకట్పల్లిలో నూతనంగా నిర్మించిన రైతు బజార్ను రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి ప్రారంభించారు. రూ.15 కోట్లతో నిర్మించిన ఈ మార్కెట్ కు 2018 లో మంత్రి హరీశ్ రావు శంఖుస్థాపన చేశారు. రైతు బజార్ ను ప్రారంభించిన అనంతరం మంత్రులు అక్కడి రైతులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు బజార్లకు కూకట్ పల్లి రైతు బజార్ ఆదర్శంగా నిలవాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతులు సేద తీరేందుకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేశామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. లైసెన్స్ లేకుంగా ఎవరైనా అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. రైతు బజార్ ప్రారంభానికి వచ్చిన మంత్రులకు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కృతజ్ఞతలు తెలిపారు.