లక్నవరం చెరువులో మంత్రుల బోటింగ్

 లక్నవరం చెరువులో మంత్రుల బోటింగ్
  • లక్నవరంలో సస్పెన్షన్ బ్రిడ్జి, 26 కాటేజ్లు ప్రారంభించిన మంత్రులు
     

ములుగు జిల్లా: లక్నవరం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. పర్యాటకులకు మరింత ఆకట్టుకునేలా సస్పెన్షన్ బ్రిడ్జి, 24 కాటేజ్ లతోపాటు ప్రత్యేక ఆకర్షణగా  2 గ్లాస్ కాటేజ్ లను శనివారం మంత్రులు ప్రారంభించారు. ఆహ్లాద వాతావరణాన్ని చూసి పరవశించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ బోటులో షికారు చేశారు. టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్, చైర్మన్ శ్రీనివాస్ గుప్త ఏర్పాటు చేసిన బోటులో క్నవరం చెరువులో మంత్రులు లాహిరి.. లాహిరి లాహిరిలో.. అంటూ షికారు చేశారు. 
గట్టమ్మ, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామర్వాయి, మల్లూరు, బొగత జలపాతాలను ట్రైబల్ సర్క్యూట్ గా అభివృద్ధి చేశారు. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ ములుగు ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 79.87 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా లక్నవరంలో 27.65 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టగా పూర్తయిన వాటిని మంత్రులు ఇవాళ ప్రారంభించారు. 

 

ఇవి కూడా చదవండి

ఐదు రాష్ట్రాల ఎన్నికలు: ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం

క్రీడలను.. క్రీడాకారులను ప్రోత్సహిస్తాం

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ 

ఘనంగా బీటింగ్ రిట్రీట్.. డ్రోన్ షోతో అగ్ర దేశాల సరసన భారత్