సప్తగోపురాలకు మంత్రుల‌ పూజలు

సప్తగోపురాలకు మంత్రుల‌ పూజలు

యాదాద్రి: యాదాద్రి ఆలయ ఉద్ఘాటన కోసం నిర్వహిస్తున్న పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవంలో భాగంగా.. సోమవారం సప్తగోపురాలకు నిర్వహిస్తున్న మహాకుంభ సంప్రోక్షణ పూజల్లో పాల్గొనడానికి ఒక్కో మంత్రికి ఒక్కో గోపురాన్ని కేటాయించారు. దివ్యవిమాన గోపురానికి సీఎం కేసీఆర్ సంప్రోక్షణ పూజలు చేశారు. ఆంజనేయస్వామి ఆలయానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, గరుడ ఆళ్వార్ సన్నిధికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంప్రోక్షణ పూజల్లో పాల్గొన్నారు. అలాగే తూర్పు రాజగోపురానికి (పంచతల) ఎండోమెంట్ మినిస్టర్ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పశ్చిమ రాజగోపురానికి (పంచతల)కి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, దక్షిణ రాజగోపురానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఉత్తర రాజగోపురానికి ఎస్సీ డెవలప్‌మెంట్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఈశాన్య ప్రాకార మంటపం-23 కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విష్వక్సేన మండపానికి ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ సంప్రోక్షణ పూజలు నిర్వహించారు.

అదేవిధంగా పశ్చిమ రాజగోపురానికి(సప్తతల) రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,  తూర్పు రాజగోపురానికి(త్రితల) సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సంప్రోక్షణ పూజల్లో పాల్గొన్నారు. మిగతా మండపాలు, అష్టభుజి ప్రాకారాలు, ప్రాకారాలు, యాలీ పిల్లర్లు, బాహ్య ప్రాకారాలు, అంతర్ ప్రాకారాలకు ప్రభుత్వ విప్ లు, పలు కార్పొరేషన్ చైర్మన్లు, సీఎంవో ఆఫీసర్లు, వైటీడీఏ ఆఫీసర్లు, పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు సంప్రోక్షణ పూజలు నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తల కోసం:

భార్యపై జోక్.. చెంప చెళ్లుమనిపించిన హాలీవుడ్ హీరో

దేవుడి దగ్గర రాజకీయాలు చేయడం బాధగా ఉంది