బైజూస్​ ఖాతాలపై తనిఖీలకు ఆదేశం

బైజూస్​ ఖాతాలపై తనిఖీలకు ఆదేశం

న్యూఢిల్లీ: ఎడ్​టెక్​ స్టార్టప్​ బైజూస్​ చిక్కుల్లో పడింది.   ఖాతా పుస్తకాలను తనిఖీ చేయాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది  ఆరు వారాల్లో నివేదికను ఇవ్వాలని కోరింది. ఇటీవల ముగ్గురు బోర్డు సభ్యులు, ఆడిటర్‌‌  సంస్థను వీడటం, అప్పులు చెల్లింపు ఆలస్యం కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నివేదికలోని విషయాల ఆధారంగా తదుపరి విచారణను సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్​కు అప్పగించాలా వద్దా ? అనే విషయాన్ని నిర్ణయిస్తుంది. 

దర్యాప్తు గురించి  ఎంసీఏ నుండి కంపెనీకి ఇంకా ఎలాంటి కమ్యూనికేషన్ అందలేదని బైజూస్‌‌కు సలహా ఇస్తున్న ఒక న్యాయ సంస్థ తెలిపింది.  ఈ విషయమై స్పందన కోసం చేసిన రిక్వెస్టులకు మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించలేదు.  బైజూస్ 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తన ఆర్థిక నివేదికలను ఇంకా సమర్పించలేదు.   జాతీయ పెన్షన్ ఫండ్‌‌కు బకాయిలు చెల్లించలేకపోవడంతో ఈ ఎడ్‌‌టెక్ కంపెనీకి ఇబ్బందులు పెరుగుతున్నాయి.  బైజూస్​విదేశీ మారకపు చట్టాలను ఉల్లంఘించిందనే ఆరోపణలూ ఉన్నాయి.