నా లవర్​కు ఎందుకు కాల్ చేస్తున్నవ్?..మాట్లాడుకుందామని పిలిచి మూకుమ్మడి దాడి

నా లవర్​కు ఎందుకు కాల్ చేస్తున్నవ్?..మాట్లాడుకుందామని పిలిచి మూకుమ్మడి దాడి
  • హాస్పిటల్​లో చికిత్స పొందుతూ బాలుడు మృతి
  • జవహర్ నగర్ పరిధిలో ఘటన

కుషాయిగూడ, వెలుగు: తన లవర్​తో ఎందుకు మాట్లాడుతున్నావని ఓ బాలుడిని మాజీ ప్రియుడి గ్యాంగ్ దారుణంగా కొట్టి చంపింది. జవహర్ నగర్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని ప్రగతి నగర్ సమీపంలో 16 ఏండ్ల బాలుడు అయాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. గురువారం సాయంత్రం ఓ యువకుడు అయాన్ కు కాల్ చేసి, తన లవర్​తో ఎందుకు మాట్లాడుతున్నావని బూతులు తిట్టాడు. మాట్లాడుకుందామని చెప్పి రాధికా థియేటర్ సమీపానికి పిలిచాడు. 

అక్కడికి చేరుకున్న బాలుడిపై మరికొంత మంది యువకులు కలిసి తీవ్రంగా దాడి చేసి బైక్​లపై వెళ్లిపోయారు. బాధితుడిని గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇచ్చి, కాప్రాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందగా, డాక్టర్లు కుషాయిగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాలుడి డెడ్​బాడీని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్​కు తరలించారు. అయాన్ పై దాడి చేసిన వారిలో ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.