వర్షాల కోసం అంట.. చిన్న పిల్లలకు పెళ్లి చేశారు

వర్షాల కోసం అంట.. చిన్న పిల్లలకు పెళ్లి చేశారు

వర్షాల కోసం కప్పలకు పెళ్లిళ్లు చేయడం చూశాం. కానీ ఓ చోట గ్రామస్థులు మితిమీరి పోయి మైనర్లకు పెళ్లి జరిపించారు. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం  చింతామణి తాలూకాలో వర్షాలు కురవట్లేదు. 

దీంతో పంటలు ఎండిపోతున్నాయి. తాగు నీటికి అవస్థలు పడుతున్నారు. వరుణ దేవుడ్ని ప్రసన్నం చేసుకునేందుకు హిరేకట్టిగెనహళ్లి గ్రామస్థులు మైనర్లకు పెళ్లి జరిపించారు.  

పెళ్లి జరిపించిన అరగంటకు వర్షం పడిందని ఆ ప్రాంత వ్యవసాయాధికారి మంజునాథ్ చెప్పడం గమనార్హం. పెళ్లి జంట  ప్రస్తుతం 5వ తరగతి చదువుతోంది. పెళ్లి జరిగినా వారు సాధారణ జీవితాన్నే గడుపుతారని స్థానికులు అన్నారు. 

కొన్ని రోజులుగా చాలా గ్రామాల్లో ఇలాగే పెళ్లిళ్లు జరిపిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.