
వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ జిల్లా కేంద్రంలోని మట్వాడ పోలీస్స్టేషన్ నుంచి మైనర్ దొంగ పారిపోయాడు. పోతూ.. పోతూ.. ఇద్దరు కానిస్టేబుల్స్ కు చెందిన సెల్ ఫోన్లు, పర్సులను ఎత్తుకెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నెల కింద సిటీలోని ఓ షాపులో రూ.5లక్షలు చోరీ జరగగా, 2 రోజుల కింద సీసీఎస్పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. విచారణ అనంతరం మట్వాడ పోలీసు స్టేషన్కు అప్పగించారు. శనివారం అర్ధరాత్రి దాటాక డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్లైట్స్ఆఫ్చేసి పడుకోవడంతో అదే అదునుగా భావించిన నిందితుడు.. కానిస్టేబుల్స్ఉన్న గదిని లాక్చేసి ఎస్కేప్అయినట్లు తెలిసింది. కాగా నిందితుడు ఎలా తప్పించుకున్నాడో చూద్దామనకుంటే స్టేషన్లోని సీసీ కెమెరాల ఫుటేజీ రికార్డ్కాలేదు. ఉన్నతాధికారులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక పోలీసులు సతమతం అవుతున్నట్లు సమాచారం.