ASP గా సిల్వర్ మెడల్ విన్నర్ మీరాబాయి చాను

ASP గా సిల్వర్ మెడల్  విన్నర్  మీరాబాయి చాను

టోక్యో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించి భారత కీర్తిపతాకను రెపరెపలాడించిన మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు విశిష్ట గౌరవం దక్కనుంది. ఆమెను అడిషనల్ ఎస్పీగా నియమించాలని మణిపూర్ ప్రభుత్వం నిర్ణయించింది.

చానుకు రూ.1 కోటి నజరానా అందించాలని ఇంతకుముందే ప్రకటించామని తెలిపారు సీఎం బీరేన్ సింగ్. తాజాగా ఆమెను ఏఎస్సీగానూ నియమిస్తున్నామని చెప్పారు. ఒలింపిక్స్ లో పాల్గొంటున్న మణిపూర్ కు చెందిన జూడో క్రీడాకారిణి లిక్మబమ్ సుశీలా దేవికి పోలీసు కానిస్టేబుల్ నుంచి ఎస్సైగా పదోన్నతి కల్పిస్తున్నామని, రూ.25 లక్షల నజరానా కూడా అందిస్తున్నామని సీఎం తెలిపారు.

టోక్యో ఒలింపిక్స్ చాను 49 కిలోల విభాగంలో రెండోస్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా చాను పేరు మార్మోగుతోంది. టోక్యోలో తన ఈవెంట్ పూర్తి కావడంతో చాను స్వదేశానికి తిరిగొచ్చింది. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది.