కామన్వెల్త్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో మీరాబాయ్‌‌కి స్వర్ణం

కామన్వెల్త్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో మీరాబాయ్‌‌కి స్వర్ణం

అహ్మదాబాద్‌‌: ఇండియా స్టార్‌‌ వెయిల్‌‌ లిఫ్టర్‌‌ మీరాబాయి చానూ రీ ఎంట్రీ అదిరింది. సోమవారం జరిగిన కామన్వెల్త్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో గోల్డ్‌‌ మెడల్‌‌తో మెరిసింది. విమెన్స్‌‌ 48 కేజీల ఫైనల్లో మీరాబాయి 198 (స్నాచ్‌‌ 84+ క్లీన్ అండ్ జెర్క్‌‌109) కేజీలు ఎత్తి పోడియం ఫినిష్‌‌ చేసింది. ఈ క్రమంలో స్నాచ్‌‌, క్లీన్‌‌ అండ్‌‌ జర్క్‌‌, మొత్తం బరువులో కొత్త కామన్వెల్త్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ రికార్డును నెలకొల్పింది. గాయంతో ఏడాదిపాటు ఆటకు దూరమైన ఇండియన్‌‌ లిఫ్టర్‌‌ ఆరు ప్రయత్నాల్లో మూడింటిని మాత్రమే విజయవంతంగా పూర్తి చేసింది. 

మోకాలి నొప్పి కారణంగా స్నాచ్‌‌ తొలి ప్రయత్నంలో 84 కేజీల బరువు ఎత్తలేకపోయింది. రెండో ప్రయత్నంలో దీన్ని క్లియర్‌‌ చేసింది. మూడో ప్రయత్నంలో 89 కేజీలు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్‌‌ అండర్‌‌ జెర్క్‌‌లో 105 కేజీలను ఈజీగా ఎత్తిన చానూ క్రమంగా 109 కేజీలకు చేరింది. 113 కేజీల ఎత్తే ప్రయత్నంలో ఫెయిలైంది. జూనియర్‌‌ కేటగిరీలో సౌమ్య దల్వి గోల్డ్‌‌ మెడల్‌‌ను కైవసం చేసుకుంది.