
‘హనుమాన్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర తాజాగా ‘మిరాయ్’తో మరో సూపర్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు హరి గౌర ఇలా ముచ్చటించాడు.
‘బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడం ఫుల్ హ్యాపీ. కార్తీక్ చాలా అద్భుతమైన చిత్రం తీశారు. ఆయన చెప్పిన కథ నన్ను ఇన్‌స్పైర్ చేసింది. సినిమా చూస్తున్నప్పుడే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి దగ్గరగా ఉందనిపించింది. రిలీజ్ తర్వాత నా మ్యూజిక్‌కి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఆడియెన్స్ థియేటర్‌లో గ్రేట్ మ్యూజిక్‌ను ఎక్స్‌పీరియన్స్ చేశాననడం ఆనందాన్ని ఇచ్చింది. ఇందులో శ్రీరాముల వారి ఆయుధానికి ప్రతిరూపంగా చూపించిన మిరాయ్‌కి శివుడి నేపథ్యంలో సాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉపయోగించడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.
అయితే దానికి శివుడి విల్లు, పినాకము అనే పేరుంది. ఆస్ఫూర్తితోనే అలా చేశాం. ఇక శ్రీరాముడు కనిపించే ఎపిసోడ్‌కు మ్యూజిక్ చేయడానికి దాదాపు పదిరోజులు పట్టింది. అందులో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే సంపతి సీన్స్‌లో నాలుగు జానర్స్‌లో సౌండ్‌ని మిక్స్ చేశా. వైబ్ వుంది సాంగ్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పాట సినిమాలో లేకపోవడం టీమ్ అందరి డెసిషన్. సినిమాకి ఏది అవసరమో అది చేయడమే కరెక్ట్ అని భావిస్తా. కీరవాణి గారితో పోల్చడం ఆనందాన్ని ఇచ్చినప్పటికీ అదే సమయంలో భయపెడుతోంది కూడా. మరొకరి ప్రభావం నాపై ఉందనే మాట రాకూడదనే ఈసారి డిఫరెంట్‌గా మ్యూజిక్ చేశా. అలాగే దాదాపు మూడు గంటల నిడివి గల ‘హనుమాన్’ సినిమాలో ఎక్కువభాగం నేనే వర్క్ చేశాను. కేవలం రెండు పాటలు చేసినందుకు సినిమా మొత్తం క్రెడిట్ ముగ్గురుకి పంచడం బాధపెట్టింది. అందుకే ఈసారి హిట్ కొడితే నా పేరు మాత్రమే వినిపించాలనే కసితో ఈ సినిమాకు పనిచేశాను. అందుకు తగ్గ గుర్తింపు రావడం సంతోషంగా ఉంది”.