
ఇటీవల రజినీకాంత్‌తో ‘కూలీ’ సినిమా తెరకెక్కించిన కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ధనుష్‌తో ‘కెప్టెన్ మిల్లర్’ తీసిన అరుణ్ మాథేశ్వరన్.. లోకేష్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌కు వెళ్లబోతోంది. ఇందులో లోకేష్‌కు జంటగా మిర్నామీనన్ నటించబోతున్నట్టు తెలుస్తోంది.
‘జైలర్’ సినిమాలో రజినీకాంత్‌కు కోడలి పాత్రలో కనిపించిన మిర్నామీనన్.. ఈ చిత్రంతో తమిళ, తెలుగు భాషల్లో పాపులర్ అయింది. అయితే అంతకంటే ముందే తెలుగులో రెండు సినిమాలు చేసిందామె. ఆది సాయికుమార్ ‘క్రేజీ ఫెలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అల్లరి నరేష్‌కు జంటగా ‘ఉగ్రమ్’లో నటించింది. ‘జైలర్’ తర్వాత నాగార్జున సినిమా ‘నా సామిరంగా’లో మెరిసింది. ప్రస్తుతం ‘జైలర్ 2’లో నటిస్తోంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే లోకేష్ కనగరాజ్‌కు జంటగా నటించబోతోంది.