పేకాటకు అడ్డాగా మారుతోన్న మిర్యాలగూడ

పేకాటకు అడ్డాగా మారుతోన్న మిర్యాలగూడ
  • పట్టణంలోని ఇండ్లు, శివారులోని తోటల్లో జూదం
  • మొక్కుబడిగా దాడులు చేస్తున్న పోలీసులు
  • అడిగినంత ఇస్తూ ఆఫీసర్లను మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్న నిర్వాహకులు

మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేకాటకు అడ్డాగా మారుతోంది. పట్టణ శివార్లలోని తోటలతో పాటు, పట్టణంలోని పలు ఇండ్లు పేకాట స్థావరాలుగా మారాయి. ఆట నిర్వాహకులు పోలీసులకు అడిగినంత ఇస్తూ వారు తమ వైపు చూడకుండా మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పేకాట నిర్వహణే దందాగా...

కొందరు వ్యక్తులు పేకాట నిర్వహణను తమ దందాగా మార్చుకుంటున్నారు. మిర్యాలగూడ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని ప్రస్తుతం ఓ పార్టీ మండల కీలక నేత గతంలో పీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బియ్యం దందా నిర్వహించేవాడు. ప్రస్తుతం పేకాట నిర్వాహకుడిగా మారి నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ పరిధిలో బత్తాయి, జామ తోటలను రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకొని దందా నడిపిస్తున్నాడు. అలాగే సూర్యాపేట జిల్లా పాలకవీడుకు చెందిన నాటుసారా బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే మరో వ్యక్తి కూడా పేకాట నిర్వాహకుడిగా మారాడు. ఇతడు మిర్యాలగూడలోని విజయ బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీపంలో, తడకమళ్ల క్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు, హౌసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు ఏరియాలోని పలు ఇండ్లను పేకాట స్థావరాలుగా వినియోగిస్తున్నారు. ఇక్కడ నిర్వహించే పేకాటకు ఏపీలోని మాచర్లతో పాటు దేవరకొండ, నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సూర్యాపేట, నల్గొండ, మిర్యాలగూడ, గరిడేపల్లి, హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కోదాడ నుంచి సుమారు 70 మంది వస్తుంటారు. ఒకవేళ మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గాల్లో పోలీసులు దాడులు చేస్తే తమ స్థావరాలను నేరేడుచర్ల మండలానికి మారుస్తున్నట్లు సమాచారం. పేకాటకు వచ్చే వారికి వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఇతర సౌకర్యాలు కూడా నిర్వాహకులే ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది.

రూ. 50 వేల నుంచి రూ. లక్ష ఉంటేనే ఎంట్రీ

జేబులో రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు ఉంటేనే పేకాట ఆడేందుకు అనుమతిస్తున్నారు. ఇలా ప్రతిరోజు మిర్యాలగూడ పరిధిలో రూ. 40 లక్షల నుంచి రూ. 70 లక్షల బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నడుస్తోంది. ఆట స్థాయిని బట్టి నిర్వాహకులు రెండు, మూడు టేబుళ్లను ఏర్పాటు చేసి రూ.10 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇలా నెలకు రూ. 6 లక్షలు వసూలు చేస్తూ ఆఫీసర్లకు మామూళ్లు ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పేకాట పేరుతో గత ఏడు నెలల్లో రూ. 84 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు చేతులు మారినట్లు సమాచారం. నిర్వాహకులు కోట్లు గడిస్తుండగా ఆట ఆడేవారు మాత్రం సర్వం కోల్పోతున్నారు. చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన మిర్యాలగూడకు చెందిన ఓ వ్యక్తి ప్రస్తుతం పేకాటలో ఆస్థినంతా కోల్పోవడంతో కుటుంబ కలహాలు పెరిగి విడిపోయే పరిస్థితి ఏర్పడింది. పేకాట కేంద్రాలు జోరుగా సాగుతున్నా పోలీసులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఆటలో మోసం చేశాడంటూ ఓ వ్యక్తి నిర్బంధం

మిర్యాలగూడ పట్టణంలో రెండు నెలల క్రితం నిర్వహించిన పేకాటలో ఏపీలోని జగ్గయ్యపేటకు చెందిన ఓ వ్యక్తి మోసం చేసి రూ. 12 లక్షలు గెలుచుకున్నాడని కొందరు పేకాటరాయుళ్లు అతడిని నిర్బంధించారు. నాలుగు రోజుల పాటు అతడిని చిత్రహింసలకు గురి చేసి అతడి ఫ్యామిలీ నుంచి మొత్తం రూ. 8 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. 

నిఘా పెడతాం 

మిర్యాలగూడ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేకాట నడుస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఇటీవల పట్టణంలో, రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరియాల్లో దాడులు చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేసినం. పేకాట, ఇతర అక్రమ దందాల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం.

-  వై.  వెంకటేశ్వరరావు, 
మిర్యాలగూడ డీఎస్పీ