నోటిని అదుపులో పెట్టుకోని ఎమ్మెల్యే.. భాస్కర్ రావు తీరుతో పరేషాన్ లో క్యాడర్ 

నోటిని అదుపులో పెట్టుకోని ఎమ్మెల్యే.. భాస్కర్ రావు తీరుతో పరేషాన్ లో క్యాడర్ 

మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. ఆయన చేసే పనుల కంటే ఆయన నోటితోనే కేరాఫ్ కాంట్రావర్సి అవుతున్నారని కేడర్, నేతలు పరేషాన్ అవుతున్నారట. ప్రజలైనా, నేతలైనా, కార్యకర్తలైనా చివరకు అధికారులైనా..నోటికి ఎంతొస్తే అంతా మాట అనేస్తున్నారట. పబ్లిక్ మీటింగ్ అయినా..అధికారిక కార్యక్రమమైన ..ప్రైవేట్ ప్రొగ్రామైనా ఎమ్మెల్యేది ఒకటే తీరట. రెస్పెక్ట్ ఇవ్వకపోయినా సరే కానీ...నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎలా అని కార్యకర్తలు తెగ ఫీలవుతున్నారట. జనంలో ఇబ్బంది పడుతున్నామని వర్రీ అవుతోందట కేడర్.

ఇండైరెక్ట్ గా కాదు...డైరెక్ట్ గానే వార్నింగ్స్ ఇస్తారు ఎమ్మెల్యే భాస్కర్ రావు. సర్కార్ స్కీమ్స్ తీసుకుంటూ ఇతర పార్టీలకు ఓట్లేస్తే..డ్యాన్స్ చేయిస్తానని డైరెక్ట్ గానే జనానికి MLA వార్నింగ్ ఇవ్వడం అప్పట్లో పెద్ద గొడవ జరిగింది. KCR వేసిన రోడ్లపై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు నడవొద్దనడం, ఇతర పార్టీల వాళ్లు దళితబంధు, కల్యాణలక్ష్మీ తీసుకోవద్దనడం వివాదాదస్పదమైంది. విపక్ష ప్రజాప్రతినిధులపై నోరు పారేసుకోవడం ఎమ్మెల్యేకు అలవాటేనన్న చర్చ ఉండనే ఉంది. మిర్యాలగూడ పరిధిలో ఈ మధ్య దళితబంధు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ప్రొగ్రాంలో ప్రోటోకాల్ పాటించలేదని విపక్ష ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తే..తననే అడుగుతారా అంటూ ఒంటికాలుపై లేచారట ఎమ్మెల్యే.

ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీ నాయకులే తలలు పట్టుకుంటున్నారట. ఎమ్మెల్యే మాట తీరు ఎప్పుడు మారుతుందోనని ఫీలవుతున్నారట. ఎవరిని పడితే వాళ్లను, ఎక్కడపడితే అక్కడ, ఇష్టం వచ్చినట్లు తిట్టడంపై ఆందోళన పడుతున్నారట. వచ్చేది ఎన్నికల సమయం. ఇలాగైతే ఓట్లు ఎలా పడతాయని ఫీల్ అవుతున్నారట. ఇప్పటికైనా నోటిని కంట్రోల్ చేసుకోవాలని ఎమ్మెల్యేని కోరుతున్నారట పార్టీ కేడర్, లీడర్లు.

https://www.youtube.com/watch?v=cP8aeqjt9aU