మిర్యాలగూడ, వెలుగు : తొమ్మిదేండ్ల బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం జరిగింది. పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన ఓ యువకుడు.. బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి లైంగిక దాడికి యత్నించాడు.
బాలిక గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరార్ అయ్యాడు. కొద్దిసేపటి తర్వాత బాలిక తన తల్లికి విషయం చెప్పగా.. టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
