
బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. మీర్జాపూర్ ఫేం, నటుడు షానవాజ్ ప్రధాన్ (56) గుండెపోటుతో మృతి చెందారు. ముంబైలో శుక్రవారం జరిగిన అవార్డు ఫంక్షన్లో షానవాజ్ ఛాతీలో నొప్పి వస్తోందంటూ స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వెంటనే ఆయన్ను కోకిలాబెన్ ధీరూభాయ్ హాస్పిటల్కు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన చనిపోయారని డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఈవెంట్ కు హాజరైన్ ‘లగాన్’ నటుడు యశ్పాల్ శర్మ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అందరి కళ్ల ముందే ఆయన ప్రాణాలు వదిలారని తెలిపారు. అతని ఆత్మకు శాంతి చేకూరని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. షానవాజ్ ప్రధాని MS ధోని: ది అన్టోల్డ్ స్టోరీ, ఖుదా హాఫీజ్, రయీస్, ఫాంటమ్ చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు. దాంతో పాటు వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్, బందీల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రైమ్ వీడియో సిరీస్ మీర్జాపూర్ లో ప్రధాన పాత్రలో నటించి గొప్ప నటుడిగా అనిపించుకున్నారు. ఇక షానవాజ్ మృతితో పలువురు సెలబ్రెటీలు, ప్రముఖులు ఆయన సంతాపం వ్యక్తం చేశారు.