హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ కట్టి పడేశాయి: మిస్ ఇండియా నందిని గుప్తా

హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ కట్టి పడేశాయి:  మిస్ ఇండియా నందిని గుప్తా

ఇండియా మిస్ వరల్డ్ 2025 పోటీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న మిస్ ఇండియా నందిని గుప్తా తనను హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ కట్టి పడేశాయని తెలిపారు.  తనకు తెలంగాణ ఎంతగానో నచ్చిందని, ఇక్కడ గొప్ప చరిత్ర ఉందని కొనియాడారు. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న సిటీ హైదరాబాద్ అని పేర్కొన్నారు.

మిస్ వరల్డ్ పోటీల కోసం వచ్చిన నందిని గుప్తా.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను గురించి తెలుసుకుని సంబురపడ్డారు. ఇప్పటికే తెలంగాణలోని పలు చారిత్రక కట్టడాలు, ఆలయాలు, పర్యాటక స్థలాలను సందర్శించారు. ట్రెడెంట్ హోటల్ నిర్వహించిన ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడారు. 

పోచంపల్లి హ్యాండ్లూమ్స్ తనకు ఎంతో నచ్చాయని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. యాంగస్ట్ స్టేట్ అయినా కూడా ఇక్కడ హాస్పటాలిటీ బాగుందని కొనియాడారు. ‘‘అందరికీ నమస్కారం.. తెలంగాణకు తప్పకుండా రండి..’’ అంటూ తెలుగులో మాట్లాడారు నందిని గుప్తా.