లావణ్య త్రిపాఠి ఫిమేల్ లీడ్‌గా విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వంలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’. అభిజీత్ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 2 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. సోమవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ‘ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు నేను మిస్ పర్ఫెక్ట్. సిరీస్ కంప్లీట్ అయ్యేలోపు మిసెస్ పర్ఫెక్ట్ అయ్యాను.
ఈ సిరీస్‌కు ముందు నేను చేసిన కొన్ని ప్రాజెక్ట్స్‌కు స్ట్రెస్ ఫీలయ్యాను. ఇలాంటి స్క్రిప్ట్ దొరకడం రిలీఫ్‌లా ఫీలయ్యా. టైటిల్‌కు తగ్గట్టే ఈ సిరీస్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది’ అని చెప్పింది. అన్నపూర్ణ సంస్థలో పనిచేయడం హ్యాపీగా ఉందని చెప్పాడు అభిజీత్. ఇదొక మంచి ఎంటర్‌టైనర్ అని, అందరికీ నచ్చుతుందన్నాడు డైరెక్టర్ విశ్వక్. సుప్రియ మాట్లాడుతూ ‘ఈ సిరీస్‌కు లావణ్య పర్ఫెక్ట్. చిన్న కథలో బలమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’ అని అన్నారు. నటులు ఝాన్సీ, అభిజ్ఞ, మహేష్ విట్టా, రోషన్, కేశవ్, రైటర్స్ ఫ్రాన్సిస్ థామస్, శృతి రామచంద్రన్, ఎడిటర్ రవితేజ గిరిజాల, సినిమాటోగ్రాఫర్ ఆదిత్య జవ్వాది, క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఆధిప్ అయ్యర్ పాల్గొన్నారు.
