కృష్ణాష్టమికి మిస్ శెట్టి

కృష్ణాష్టమికి మిస్ శెట్టి

అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధానపాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. పి.మహేష్‌‌‌‌ బాబు దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 4న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు కొద్దిరోజులు క్రితం నిర్మాతలు ప్రకటించారు. సోమవారం కొత్త రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేశారు. 

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 7న విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా విడుదల చేసిన స్పెషల్  వీడియో ఆకట్టుకుంది. ఇప్పటికే విడుదల  చేసిన టీజర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 

చెఫ్‌‌‌‌ అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క, స్టాండప్‌‌‌‌ కమెడియన్‌‌‌‌ సిద్ధు పొలిశెట్టిగా నవీన్ పొలిశెట్టి నటిస్తున్నారు.  తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.