షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ కింద వెళ్తుంటే జర భద్రం.. పాపం స్కూటీ కొని 15 రోజులే.. ఏమైందో చూడండి !

షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ కింద వెళ్తుంటే జర భద్రం.. పాపం స్కూటీ కొని 15 రోజులే.. ఏమైందో చూడండి !

హైదరాబాద్: షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి రైన్ వాటర్ వెంట్ పైపు మరోసారి బైకర్పై ఊడిపడింది. రోడ్డుపై వెళ్తున్న స్కూటర్‌పై.. పైప్ పడటంతో స్కూటర్‌ ముందు భాగం నుజ్జునుజ్జయింది. బైకర్ హెల్మెట్ పెట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. స్కూటీ కొని కేవలం 15 రోజులే అయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలోనూ ఇదే ఫ్లైఓవర్‌పై పైపులు ఊడిపోయిన ఘటనలు ఉన్నాయి. 

ఫ్లైఓవర్‌ మెయింటెనెన్స్‌పై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫ్లైఓవర్‌పై పైపులు, వెంట్స్‌ను వెంటనే తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. మరోసారి ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.