ఆద్యంతం నవ్వులు పూయిస్తూ.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ట్రైలర్

ఆద్యంతం నవ్వులు పూయిస్తూ.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ట్రైలర్

అనుష్క శెట్టి(AnushkaShetty), నవీన్ పొలిశెట్టి(NaveenPolishety) లీడ్‌‌‌‌ రోల్స్‌‌‌‌లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి(MissShettyMrPolishetty). లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ ను నవీన్ పోలిశెట్టి ఫ్యాన్స్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ..యూత్ కి కనెక్ట్ అయ్యే సీన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అనుష్క నవీన్ ను ఇంటర్వ్యూ చేస్తూ..ఇంజినీరింగ్ చేసి స్టాండప్ కామెడీ ఏంటి? అంటూ ట్రైలర్ మొదలయ్యింది. ఇదే కదా నేటి ప్రాసెస్ అంటూ హీరో నవీన్ చెప్పే డైలాగ్ ఆలోచింపజేస్తుంది. అలాగే  స్టాండప్ కమెడియన్ గా నవ్వులు పూయిస్తున్న హీరోని,అనుష్క తన రెస్టారెంట్ లో జాయిన్ చేసుకుంటుందని తెలుస్తుంది. 

అమ్మాయిలకి అబ్బాయిలు నచ్చాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది బ్రో..కానీ అబ్బాయిలకి లిస్ట్ ఏం వుండదు. జస్ట్ అమ్మాయి అయితే చాలు! సీసీటీవీ కెమెరా ఉంది అక్కడ. నాకేం ప్రాబ్లం లేదు. వైరల్ అయిపోతాం..లాంటి నేటి యూత్ కనెక్ట్ అయ్యే ఫన్నీ డైలాగ్స్‌తో ట్రైలర్‌ను నింపేశారు. ఈ డైలాగులకు నవీన్ పోలిశెట్టి మార్కు డైలాగ్ డెలివరీ యాడ్ అయి మరింత హిలేరియస్‌గా మారిపోయాయి. ఇలా లండన్ నుంచి వచ్చిన ఓ చెఫ్‌కు, హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఓ యువకుడికి మధ్య..రిలేషన్ షిప్‌ను చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.

అనుష్క కు పెళ్లి మీద మంచి ఒపీనియన్ లేకపోవడం వంటి సీన్స్ డైరెక్టర్ చూపించారు. ఇక తనకి నచ్చిన అబ్బాయితో పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అవ్వాలని అనుకున్న అనుష్క కి..నవీన్ తోడవ్వడంతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా కనిపిస్తోంది. ఇక వీరిద్దరీ పరస్పర నిర్ణయాలతో..హీరో తన ప్రేమతో అనుష్కని మారుస్తాడా..లేదా అనేది ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. 

ఈ మూవీ చాలా రోజుల నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవ్వకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది.ఇక లేటెస్ట్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో నవీన్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. హీరో నవీన్ పోలిశెట్టి కామిక్ యాంగిల్ తో సెపెరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నారు. 

ఇక చాలా కాలం తర్వాత అనుష్క నుంచి మూవీ వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు రధన్( Radhan) మ్యూజిక్ అందిస్తున్నారు.ఇప్పటికే మూడు పాటలు,టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇందులో చెఫ్‌‌‌‌ అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క నటించగా, స్టాండప్‌‌‌‌ కమెడియన్‌‌‌‌ సిద్ధు పొలిశెట్టిగా నవీన్ కనిపించనున్నారు. ఈ మూవీ వచ్చే నెల (సెప్టెంబర్ 7న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.