ప్రపంచ సుందరాంగుల వరంగల్​.. రామప్ప టూర్​.. షెడ్యూల్​ ఇదే..

ప్రపంచ సుందరాంగుల  వరంగల్​.. రామప్ప  టూర్​.. షెడ్యూల్​ ఇదే..

 ప్రపంచ అందగత్తెల  రాక కోసం వరంగల్ కోట ముస్తాబవుతోంది.  ఈ రోజు 14న మిస్‌ వరల్డ్ ప్రతినిధుల టీమ్ వరంగల్ కు రానుండగా.. వారి సందర్శనార్థం కాకతీయుల రాజధానిగా వెలుగొందిన వరంగల్ కోటను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ మేరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. 

హైదరాబాద్‌ నుంచి రెండు బృందాలుగా ప్రత్యేక బస్సుల్లో వరంగల్ జిల్లాకు మిస్ వరల్డ్ కంటెస్టెంట్ క్యాండిడేట్స్ చేరుకోనున్నారు. ప్రపంచంలోని 109 దేశాలకు చెందిన సుందరీమణులు గ్రేటర్‌ వరంగల్‌ నగరానికి, 32 దేశాల వారు రామప్ప ఆలయానికి రానున్నారు.

ఒక బృందం హనుమకొండలోని హరిత కాకతీయకు సాయంత్రం 4.35 గంటలకు చేరుకుంటుంది. మరో బృందం రామప్పకు చేరుకోనుంది. ఒక బృందం వేయిస్తంభాల ఆలయం, వరంగల్‌ కోట సందర్శన ఉండనుంది. రెండో టీమ్ రామప్పలో సందడి చేయనున్నారు. 


రామప్ప దేవాలయానికి చేరుకునే టీం షెడ్యూల్​ వివరాలు

  • సాయంత్రం 4 గంటలకు రామప్ప చేరుకుంటారు
  • 4:40 :  రామప్ప సరస్సు అందాల వద్ద ఫొటో సెషన్‌లో 
  •  4:55 :  రామప్ప ఆలయ సందర్శన
  • 5 గంటలకు :  కొమ్ముకోయ నృత్యంతో కళాకారులు స్వాగతం 
  •  5:10 నుంచి 6 గంటల వరకు:   రామలింగేశ్వరస్వామిని దర్శనం, శిల్పకళాసంపదను చూడటం.
  •  6.10 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకు:  రామప్ప గార్డెన్‌లో అలేఖ్య శాస్త్రీయ నృత్యం వీక్షించడం, సన్మాన కార్యక్రమం
  •  రాత్రి 7.20 :  ఇంటర్‌ప్రిటిషన్‌ సెంటర్‌కు 
  • 7.30: డిన్నర్‌ 
  • 8:15  : హైదరాబాద్​ కు రిటన్​ జర్నీ

 హన్మకొండ కి చేరుకునే బృందం షెడ్యూల్​

 

  • సాయంత్రం 4 గంటలకు హన్మకొండ చేరుకొని హరిత హోటల్​ లో బస
  •  సాయంత్రం 5.45 గంటలకు వేయిస్తంభాల గుడికి చేరుకుంటారు.  అక్కడే 40 నిమిషాలు పాటు పలు  కార్యక్రమాలు
  • సాయంత్రం 6.25  నుంచి  7.30 వరకు వరంగల్‌ కోటలో శివతాండవం ... ఇతర కార్యక్రమాలు 
  • 8 గంటల నుంచి 9 గంటల వరకు డిన్నర్​
  • 9.15 గంటలకు హైదరాబాద్‌కు రిటన్​ జర్నీ

టూరిజాన్ని ప్రమోట్ చేసేలా..

 ప్రపంచ అందగత్తెల కోసం హిస్టారికల్, టూరిస్ట్ స్పాట్ల విజిట్ ను   తెలంగాణ పర్యాటక శాఖ ప్లాన్ చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల సందర్శించేలా ప్రోగ్రామ్ డిజైన్ చేయగా.. వరంగల్ లో కాకతీయుల పాలనకు కేంద్రమైన వరంగల్ కోటను టూర్ జాబితాలో చేర్చింది. దీంతో వారిని ఆకట్టుకునేలా అధికారులు ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. రామప్ప ఆలయాన్ని కూడా మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నారు.  ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.