
మహబూబ్ నగర్ జిల్లా కాటేదాన్ లో దారుణం జరిగింది. సాయిప్రియ అనే యువతి.. ప్రియుడు శ్రీశైలం చేతిలో దారుణహత్యకు గురైంది. తనను ప్రేమించి మరో వ్యక్తితో వివాహానికి సిద్దమైందనే అక్కసుతో శ్రీశైలం అనే యువకుడు యువతిని మర్డర్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. చివరిసారిగా మాట్లాడుకుందామని చెప్పి యువతిని మహబూబ్ నగర్ లోని తన డైరీ ఫామ్ దగ్గరికి తీసుకెళ్లి.. శ్రీశైలం హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు.
మహబూబ్ నగర్ జిల్లా మామాజీపూర్‌కు చెందిన శ్రీశైలం యాదవ్, సాయిప్రియ.. ఇద్దరూ స్కూల్‌లో క్లాస్‌మేట్స్. శంషాబాద్ ప్రభుత్వ పాఠశాలలో వీరిద్దరు కలిసి చదువుకున్నారు. ఒకే సామాజిక వర్గం కావడంతో ఒకర్నొకరు ఇష్టపడ్డారు.కానీ వీరి ప్రేమను సాయిప్రియ తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ క్రమంలో సాయిప్రియతో చివరిసారిగా మాట్లాడాలంటూ శ్రీశైలం తన డైరీ ఫామ్ దగ్గరికి రమ్మని చెప్పాడు. స్నాప్ చాట్ ద్వారా వీరిద్దరూ మెసేజ్ చేసుకునేవారు. తండ్రికి తిరుపతికి వెళ్తున్నాని చెప్పి వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టింది.
శ్రీశైలం మాయ మాటలు నమ్మిన సాయిప్రియ... సెప్టెంబర్ 5 న ప్రియుడిని కలిసేందుకు కాటేదాన్ వెళ్లింది. పెండ్లి విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో తనకు దక్కనది మరోకరికి దక్కకూడదన్న అక్కసుతో సాయిప్రియపై అత్యాచారం చేశాడు శ్రీశైలం. అనంతరం చున్నీతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి తన డెయిరీ ఫామ్ సమీపంలో పాతిపెట్టాడు. నిందితుడు శ్రీశైలంను అరెస్ట్ చేసిన మైలార్ దేవిపల్లి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.