ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మిస్సింగ్

V6 Velugu Posted on Apr 10, 2021

హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు మైనర్ బాలికల మిస్సింగ్ కలకలం రేపుతోంది. వనస్థలిపురం ప్రగతి నగర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు ఐశ్వర్య బెక్(17), అస్మా బెక్(15) మరియు అబీర్ బెక్(14) శుక్రవారం తెల్లవారుజాము నుంచి కనిపించడంలేదు. స్థానికంగా ఉండే రమేష్.. అతని స్నేహితులతో కిడ్నాప్ చేయించినట్టు బాధిత కుటుంబ సభ్యులు  ఆరోపిస్తున్నారు. ఐశ్వర్య బెక్‌ని ప్రేమిస్తున్నాని రమేష్ వెంటపడుతుండటంతో బాధిత కుటుంబ సభ్యులు పలుమార్లు రమేష్‌ని హెచ్చరించారు. రమేష్ ఆగడాలు ఎక్కువకావడంతో ఐశ్వర్య కుటుంబసభ్యులు వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో రమేష్ మీద కేసు పెట్టారు. దాంతో పోలీసులు వేధింపుల కేసులో రమేష్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దాంతో రమేష్ కక్షపూరితంగానే.. ముగ్గురు అక్కచెల్లెళ్లను కిడ్నాప్ చేయించినట్లుగా ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. రమేష్ మీద  పోలీసులు కొత్తగా కిడ్నాప్ కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Tagged Hyderabad, vanasthalipuram, missing

Latest Videos

Subscribe Now

More News