టీమిండియాతో టీ20 సిరీస్కు కివిస్ జట్టు ఇదే

టీమిండియాతో టీ20 సిరీస్కు కివిస్ జట్టు ఇదే

టీమిండియాతో త్వరలో జరగబోయే టీ20 సిరీస్ కు 15 మందితో కూడిన జట్టును న్యూజిలాండ్  ప్రకటించింది.  పాకిస్థాన్ తో జరిగిన టెస్ట్ సిరీస్ తర్వాత విలియమ్సన్, టిమ్ సౌథీలకు రెస్ట్ ఇచ్చిన కివీస్ బోర్డ్, ఈ సిరీస్ కోసం మిచెల్ శాంటర్న్ కెప్టెన్ గా నియమించింది.  ఈ సిరీస్ లో కివీస్ తరుపున ఇద్దరు కొత్త  ప్లేయర్స్ అరంగేట్రం చేయనున్నారు. పాకిస్థాన్ గడ్డపై వన్డేల్లో సత్తాచాటిన లిస్టర్, హెన్రీ షిప్లీలకు జట్టులో అవకాశం దక్కింది. కేల్ జెమీసన్, బెన్ సియర్స్, మాట్ హెన్రీ, ఆడమ్ మిల్నేలు గాయాల కారణంగా ఈ సిరీస్ కి దూరం అయ్యారు. జనవరి 27, 29, ఫిబ్రవరి 1 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి.

టీమ్ వివరాలు: మిచెల్ సాంట్నర్ (సి), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డేన్ క్లీవర్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, బెన్ లిస్టర్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ రిప్పన్, హెన్రీ షిప్లీ, సోధీ, టిక్నర్