IPL 2025: హ్యాండిచ్చిన స్టార్క్, డుప్లెసిస్.. ఘోరంగా ఢిల్లీ పరిస్థితి.. నలుగురు ఫారెన్ ప్లేయర్స్ ఔట్

IPL 2025: హ్యాండిచ్చిన స్టార్క్, డుప్లెసిస్.. ఘోరంగా ఢిల్లీ పరిస్థితి.. నలుగురు ఫారెన్ ప్లేయర్స్ ఔట్

ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్ లోని మిగిలిన మ్యాచ్ లకు ఢిల్లీ జట్టు నుంచి ఏకంగా నలుగురు ఫారెన్ ప్లేయర్స్ దూరం కానున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ వైదొలగడంతో అతని స్థానంలో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ ను ఢిల్లీ యాజమాన్యం ఎంపిక చేసింది. తాజాగా ఆ జట్టు నుంచి స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఈ సీజన్ ఐపీఎల్ కు అందుబాటులో ఉండదని అధికారికంగా తన నిర్ణయాన్ని తెలిపాడు. 

ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఫాఫ్ డుప్లెసిస్ ఐపీఎల్ కోసం ఇండియాకు రావట్లేదని తెలిపాడు. డుప్లెసిస్ తో పాటు సహచరుడు డెనోవన్ ఫెరారా మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఒకే సారి నాలుగు ఫారెన్ ప్లేయర్లను దూరం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాల్లో పడింది. అక్షర్ సేన ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే మిగిలిన మూడు మ్యాచ్ ల్లో రెండు మ్యాచ్ ల్లో విజయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఫారెన్ ప్లేయర్స్ ఆ జట్టుకు హ్యాండ్ ఇవ్వడంతో ఇండియన్ ప్లేయర్ల మీదే ఆ జట్టు అతిగా ఆధారపడనుంది. 

Also Read : బెంగళూరులో భారీ వర్షాలు.. RCB, కోల్‌కతా మ్యాచ్ జరుగుతుందా..?

సౌతాఫ్రికా ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్ లీగ్ మ్యాచ్ లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నారు. ఆ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం సౌతాఫ్రికా బయలుదేరుతాడు. ప్రస్తుతం ఢిల్లీ జట్టులో స్టబ్స్ తో పాటు ఉన్న ఏకైక విదేశీ ఆటగాళ్ళు  సెడికుల్లా అటల్,  దుష్మంత చమీర.ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 11 మ్యాచ్ ల్లో 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్ లు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తో ఆడనుంది. రీ షెడ్యూల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్ ను ఆదివారం (మే 18) గుజరాత్ టైటాన్స్ తో ఆడనుంది.