IPL 2025: బెంగళూరులో భారీ వర్షాలు.. RCB, కోల్‌కతా మ్యాచ్ జరుగుతుందా..?

IPL 2025: బెంగళూరులో భారీ వర్షాలు.. RCB, కోల్‌కతా మ్యాచ్ జరుగుతుందా..?

భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఐపీఎల్ 2025కి గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. మే7 న టోర్నమెంట్ ఆగిపోయి మే 17నుంచి ప్రారంభం కానుంది. 10 రోజుల తర్వాత రీ స్టార్ట్ కానున్న ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ లో ఆతిధ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడబోతుంది. శనివారం (మే 17) బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.

ఈ మ్యాచ్ వర్షం రూపంలో రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం (మే 15) బెంగళూరులో భారీ వర్షం పడడంతో గ్రౌండ్ మొత్తం కవర్లు కప్పి ఉంచారు. ఆర్సీబీ ప్లేయర్ టిమ్ డేవిడ్ గ్రౌండ్ లో ఏకంగా స్విమ్మింగ్ కొట్టాడంటే ఎంత భారీ వర్షం పడిందో అర్ధం చేసుకోవచ్చు.  గ్రౌండ్ మొత్తం కవర్లతో కప్పి ఉంచగా వాటి మీద వర్షం నీళ్లతో కవర్లు కూడా మునిగిపోయాయి.  

బెంగళూరులో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. వాతావరణ సూచన ప్రకారం మ్యాచ్ జరిగే రోజు మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది. సాయంత్రం సమయంలో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని.. మ్యాచ్ సమయంలో దాదాపు 8 మి.మీ వర్షం పడే ఛాన్స్ ఉందని అంచనా వేయబడింది. అక్యూవెదర్ ప్రకారం దాదాపు రెండు గంటల వర్షం పడుతుందని సమాచారం. 

Also Read :  గ్రౌండ్‌లో స్విమ్మింగ్‌తో సర్ ప్రైజ్ చేసిన RCB ప్లేయర్

ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. అప్పుడు ఆర్సీబీ ఖాతలో 17 పాయింట్లు ఉంటాయి. మరోవైపు కేకేఆర్ కు 12 పాయింట్లు ఉంటాయి. దీంతో ఆర్సీబీ దాదాపు ప్లే ఆఫ్స్ స్థానాన్ని ఖరారు చేసుకోగా.. కేకేఆర్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. 

ఈ సీజన్ లో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన 11 మ్యాచ్ ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న పటిదార్ సేనతర్వాత జరగబోయే మూడు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచినా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. కనీసం రెండు మ్యాచ్ లు గెలిచినా ప్లే టాప్-2 లో ఉండే అవకాశం ఉంది. కేకేఆర్ 12 మ్యాచ్ ల్లో 11 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతుంది.