IPL 2025: ఇది కదా ఎంజాయ్ అంటే: గ్రౌండ్‌లో స్విమ్మింగ్‌తో సర్ ప్రైజ్ చేసిన RCB ప్లేయర్

IPL 2025: ఇది కదా ఎంజాయ్ అంటే: గ్రౌండ్‌లో స్విమ్మింగ్‌తో సర్ ప్రైజ్ చేసిన RCB ప్లేయర్

ఐపీఎల్ 2025లో రీ షెడ్యూల్ లో భాగంగా తొలి మ్యాచ్ లో ఆతిధ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడబోతుంది. శనివారం (మే 17) బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కు ముందు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. ఈ కీలక మ్యాచ్ కు వరుణుడు అడ్డు పడే ఛాన్స్ ఉంది. గురువారం (మే 15) బెంగళూరులో భారీ వర్షం పడింది.  దీంతో ఇరు జట్ల మధ్య ప్రాక్టీస్ జరగలేదు. వర్షం ఎక్కువగా పడడంతో  చిన్నస్వామి స్టేడియం తడిసి ముద్దయింది. గ్రౌండ్ మొత్తం కవర్లతో కప్పి ఉంచగా వాటి మీద వర్షం నీళ్లతో కవర్లు కూడా మునిగిపోయాయి. 

మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సంగతి పెడితే వర్షాన్ని ఆర్సీబీ ప్లేయర్ టిమ్ డేవిడ్ బాగా వినియోగించుకున్నారు. భారీ వర్షం పడుతుండగానే సరదాగా ఈత కొట్టి ఫుల్ గా ఎంజాయ్ చేశాడు. చాలా సేపు గ్రౌండ్ లోనే గడిపిన డేవిడ్ ఆర్సీబీ ప్లేయర్లను నవ్వించాడు. అతను డ్రెస్సింగ్ రూమ్ కు తిరిగి వస్తున్నపుడు సహచరులు చప్పట్లు కొడుతూ నవ్వుకున్నారు. డేవిడ్ తన స్విమ్మింగ్ తో అందరినీ ఎంటర్ టైన్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Also Read : ఆ రెండు జట్లకు ఫుల్ హ్యాపీ

టిమ్ డేవిడ్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున ఈ యూసీస్ పవర్ హిట్టర్.. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ లో రూ. 3 కోట్లకు ఆర్సీబీ తరపున ఆడుతూ అదరగొడుతున్నాడు. ప్రస్తుత సీజన్‌లో డేవిడ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. 11 మ్యాచ్‌ల్లో 93 యావరేజ్ తో 186 పరుగులు చేశాడు. 194 స్ట్రైక్ రేట్‌తో ఆర్సీబీ జట్టు ఫినిషింగ్ బాధ్యతలను సమర్ధవంతంగా పోషిస్తున్నాడు. 2021లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన డేవిడ్.. ఇప్పటివరకు 33.80 సగటు.. 174.94 స్ట్రైక్ రేట్‌తో 845 పరుగులు సాధించాడు. 

ఈ సీజన్ లో ఆర్సీబీ ఆడిన 11 మ్యాచ్ ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న పటిదార్ సేనతర్వాత జరగబోయే మూడు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచినా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. కనీసం రెండు మ్యాచ్ లు గెలిచినా ప్లే టాప్-2 లో ఉండే అవకాశం ఉంది.