ఢిల్లీ: విమెన్స్ టీ20 చాలెంజ్‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల 23న పుణెలోని ఎంసీఏ స్టేడియంలో ట్రయల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ టోర్నీ ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో పోటీపడబోతున్న మూడు జట్లను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. సూపర్ నోవాస్ కు హర్మన్‌ప్రీత్ కౌర్, ట్రయల్‌బ్లేజర్స్ కు స్మృతి మంధాన, వెలాసిటీ జట్టుకు దీప్తి శర్మను కెప్టెన్లుగా ఎంపిక చేసింది. కానీ, గత సీజన్‌లో ఆడిన సీనియర్ ప్లేయర్లు మిథాలీ రాజ్, జులన్ గోస్వామితో పాటు శిఖా పాండేకు ఈ మూడు జట్లలో చోటు దక్కలేదు. గతేడాది వరకు వెలాసిటీ టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్న మిథాలీ, జులన్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కాగా, హైదరాబాద్ ప్లేయర్లు అరుంధతి రెడ్డి (ట్రయల్ బ్లేజర్స్), ప్రణవి చంద్ర (వెలాసిటీ) ఈ టోర్నీలో బరిలో దిగబోతున్నారు. ప్రతి టీమ్‌లో నలుగురు ఫారిన్ ప్లేయర్లను కూడా తీసుకున్నారు.

