నలుగురు మిత్రుల నవ్వుల విందు.. ‘మిత్ర మండలి’ ట్రైలర్ వచ్చేసింది

నలుగురు మిత్రుల నవ్వుల విందు.. ‘మిత్ర మండలి’ ట్రైలర్ వచ్చేసింది

ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్‌‌‌‌ఎం లీడ్ రోల్స్‌‌‌‌లో  విజయేందర్ ఎస్  రూపొందిస్తున్న  చిత్రం ‘మిత్ర మండలి’.  బన్నీ వాస్ సమర్పణలో కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 16న సినిమా విడుదల కానుంది. మంగళవారం ‘లిటిల్ హార్ట్స్’ మూవీ టీమ్ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ ‘ప్రేక్షకులు హ్యాపీగా నవ్వుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాం. ‘జాతిరత్నాలు’కు రెట్టింపు నవ్వులు పంచుతూ కొత్త అనుభూతిని అందించబోతున్నాం’ అని చెప్పాడు.

ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ  కడుపుబ్బా నవ్విస్తుందని రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా అన్నారు.  మొదటి సినిమాలోనే  మంచి పాత్ర పోషించడం చాలా  సంతోషంగా ఉందని నిహారిక చెప్పింది. నలుగురు స్నేహితులు కలిసి సరదాగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటే ఎలా ఉంటుందో ఈ సినిమా కూడా అంతే హాయిగా ఉంటుందని బన్నీ వాస్ అన్నారు. ఈ దీపావళికి నవ్వులు టపాసులతో ఆడియెన్స్‌‌‌‌ ముందుకొస్తున్నాం అని దర్శక నిర్మాతలు చెప్పారు. మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.